China: అమెరికా సీజ్ చేసిన చైనా బొమ్మల్లో ప్రమాదకర రసాయనాలు

  China toys popular in India having dangerous chemicals

  • చైనా ఆటవస్తువుల్లో ప్రమాదకర స్థాయిలో సీసం, కాడ్మియం, బేరియం
  • కొనుగోలు చేసేముందు ఆలోచించాలన్న అమెరికా ప్రభుత్వం
  • చైనా తయారీ ‘లగోరి 7 స్టోన్స్’ బొమ్మలకు భారత్‌లో విపరీతమైన డిమాండ్

చైనా తయారీ ఆట వస్తువులు లేని ఇల్లు ఉండదనడం అతిశయోక్తి కాదు. ఆ బొమ్మల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్టు ఏళ్ల తరబడి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటి దిగుమతిపై భారత ప్రభుత్వం ఆంక్షలు కూడా విధించింది. వాటి వాడకంపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

తాజాగా అమెరికా ప్రభుత్వం కూడా ఈ బొమ్మల విషయంలో తమ పౌరులకు హెచ్చరికలు చేసింది. చైనా తయారీ బొమ్మలపై జాగ్రత్తగా ఉండాలని, వాటిలో తీవ్ర హానికారక రసాయనాలు ఉన్నాయని పేర్కొంది. ఆన్‌లైన్‌లో వాటిని కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అమెరికాలో హాలిడే షాపింగ్ ప్రారంభం కావడానికి ముందు చైనా నుంచి పెద్ద మొత్తంలో దేశంలోకి ఆటవస్తువులు దిగుమతి అయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, బాల్టిమోర్ పోర్టుకు చేరుకున్న ‘లగోరి 7 స్టోన్స్’ ఆట వస్తువులను ఆగస్టు 24న అమెరికా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం వాటిని ప్రయోగశాలకు పంపించి పరీక్షలు నిర్వహించగా, బొమ్మల పైపూతలో సీసం, కాడ్మియం, బేరియం తదితర ప్రమాదకర రసాయనాలు అధికంగా ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న లగోరి 7 స్టోన్స్ ఆట వస్తువులకు భారత్‌లో విపరీతమైన డిమాండ్ ఉండడం గమనార్హం.

  • Loading...

More Telugu News