Whatsapp: ఈ పాత మోడల్ ఫోన్లలో నిలిచిపోనున్న వాట్సాప్!
- పలు మోడళ్లలో నిలిచిపోనున్న వాట్సాప్
- జాబితాలో ఆపిల్, శాంసంగ్, ఎల్జీ కంపెనీల ఫోన్లు
- జియో ఫోన్ యూజర్లకు అంతరాయం ఉండదన్న ఫేస్ బుక్
- metro.co.uk లో కథనం
పాత మోడల్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వీటిలో ఆపిల్, శాంసంగ్, ఎల్జీ వంటి దిగ్గజ సంస్థలకు చెందిన ఫోన్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0.4 వెర్షన్లపై నడిచే ఫోన్లు, ఐఫోన్లలోనూ పాత వెర్షన్లలో ఇకమీదట వాట్సాప్ సేవలు అందించలేమని మాతృసంస్థ ఫేస్ బుక్ వెల్లడించింది. అదేసమయంలో జియో ఫోన్ యూజర్లకు ఎలాంటి అంతరాయం ఉండదని భరోసా ఇచ్చింది. కేఏఐ 2.5.1 వెర్షన్, దాని అప్ డేటెడ్ కొత్త వెర్షన్లు కలిగి ఉన్న ఫోన్లలో వాట్సాప్ యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు metro.co.uk లో ఓ కథనం వచ్చింది.
వాట్సాప్ సేవలు నిలిచిపోయే ఆపిల్ ఫోన్లు ఇవే...
- ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ (ఫస్ట్ జనరేషన్)
- ఐఫోన్ 6ఎస్
- ఐఫోన్ 6ఎస్ ప్లస్
వాట్సాప్ సేవలు నిలిచిపోయే శాంసంగ్ ఫోన్లు ఇవే...
- శాంసంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్
- గెలాక్సీ ట్రెండ్ II
- గెలాక్సీ ఎస్ II
- గెలాక్సీ ఎస్3 మినీ
- గెలాక్సీ ఎక్స్ కవర్ 2
- గెలాక్సీ కోర్
- గెలాక్సీ ఏస్ 2
వాట్సాప్ సేవలు నిలిచిపోయే ఎల్జీ మోడల్స్ ఇవే...
- ఎల్జీ లూసిడ్ 2
- ఆప్టిమస్ ఎఫ్ 7
- ఆప్టిమస్ ఎఫ్ 5
- ఆప్టిమస్ ఎల్ 5
- ఆప్టిమస్ ఎల్ 3 డ్యూయల్ II
- ఆప్టిమస్ ఎల్ 5 II
- ఆప్టిమస్ ఎల్ 5 డ్యూయల్
- ఆప్టిమస్ ఎల్ 7
- ఆప్టిమస్ ఎల్ 3 II
- ఆప్టిమస్ ఎల్ 7 II డ్యూయల్
- ఆప్టిమస్ ఎల్ 7 II
- ఆప్టిమస్ ఎఫ్ 6
- ఇనాక్ట్ ఆప్టిమస్ ఎల్ 4 II డ్యూయల్
- ఆప్టిమస్ ఎఫ్ 3
- ఆప్టిమస్ నిట్రో హెచ్ డీ
- 4 ఎక్స్ హెచ్ డీ ఆప్టిమస్ ఎఫ్3
- ఆప్టిమస్ ఎల్ 4 II
- ఆప్టిమస్ ఎల్ 2 II
జెడ్ టీఈ ఫోన్లలో వాట్సాప్ నిలిచిపోయే మోడళ్లు ఇవే...
- జెడ్ టీఈ గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్
- జెడ్ టీఈ వి956
- గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వి987
- గ్రాండ్ మెమో
హువావే ఫోన్లలో వాట్సాప్ నిలిచిపోనున్న మోడళ్లు ఇవే...
- హువావే అసెండ్ జీ740
- అసెండ్ మేట్
- అసెండ్ డీ క్వాడ్ ఎక్స్ఎల్
- అసెండ్ డీ1 క్వాడ్ ఎక్స్ ఎల్
- అసెండ్ పీ1 ఎస్
- అసెండ్ డీ2