lakhimpur: జైలులో డెంగ్యూ సోక‌డంతో.. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడిని ఆసుప‌త్రికి త‌ర‌లించిన అధికారులు

ashish mishra joins in hospital

  • లఖింపూర్‌ ఖేరీ హింస కేసులో నిందితుడిగా ఆశిష్ మిశ్రా
  • జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
  • ర‌క్త న‌మూనాల‌ను డెంగ్యూ నిర్ధారణ కోసం పంపామ‌న్న అధికారులు

ఇటీవ‌ల‌ ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్‌ ఖేరీలో రైతుల‌ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న వేళ హింస చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాపై విచార‌ణ జ‌రుగుతోన్న నేప‌థ్యంలో జైలులో ఉన్నారు. ఆయ‌న‌కు డెంగ్యూ సోకిందని అధికారులు తెలిపారు.

దీంతో ఆయనను జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామ‌ని వివ‌రించారు. ఆయ‌న ర‌క్త న‌మూనాల‌ను డెంగ్యూ నిర్ధారణ కోసం పంపార‌ని తెలిపారు. కాగా, లఖింపూర్‌ ఖేరీ ఘ‌ట‌న కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతున్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు 13 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

  • Loading...

More Telugu News