South Africa: స్పుత్నిక్ టీకాతో హెచ్ఐవీ ముప్పు ఎక్కువ.. దక్షిణాఫ్రికా సంచలన ప్రకటన

HIV Risk In Men Higher With Sputnik Vaccine South Africa Rejects Permission
  • రష్యా కరోనా వ్యాక్సిన్ కు అనుమతులివ్వలేమని వెల్లడి
  • సరైన డేటా ఇస్తే పరిశీలిస్తామని కామెంట్
  • టీకా వినియోగాన్ని రద్దు చేసిన నమీబియా
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతిచ్చేదాకా నిలుపుదల
రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీతో హెచ్ఐవీ ముప్పుందంటూ దక్షిణాఫ్రికా సంచలన కామెంట్లు చేసింది. అడినోవైరస్ టైప్ 5 వెక్టార్లతో హెచ్ఐవీ ముప్పు ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయని, ఈ నేపథ్యంలోనే అదే వెక్టార్ తో తయారైన స్పుత్నిక్ వ్యాక్సిన్ వల్ల పురుషుల్లో హెచ్ఐవీ ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, కాబట్టి రష్యా వ్యాక్సిన్ ను అనుమతించలేమని దక్షిణాఫ్రికా ఔషధ నియంత్రణ సంస్థ గత సోమవారం తేల్చి చెప్పింది. దానికి సంబంధించిన డేటానూ రష్యా సమర్పించలేదని, ఆ డేటాను అందజేశాక టీకా అనుమతులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

దక్షిణాఫ్రికా ప్రకటనతో ఆఫ్రికా దేశమైన నమీబియా స్పుత్నిక్ వ్యాక్సిన్లను తాత్కాలికంగా నిలిపేసింది. ఇప్పటికే అక్కడ జనానికి స్పుత్నిక్ టీకాలు ఇస్తున్న ఆ దేశం.. మధ్యలోనే ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నమీబియా ఇవాళ ప్రకటన చేసింది. దక్షిణాఫ్రికా ప్రకటనను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చేంత వరకు స్పుత్నిక్ వ్యాక్సిన్ ను నిలిపేస్తున్నామని తేల్చి చెప్పింది.
South Africa
Sputnik V
COVID19
Corona Vaccine
Namibia
Russia

More Telugu News