Cricket: టీమిండియా ఆటగాళ్లకు నిద్రమాత్రలివ్వండి.. పాక్ జట్టుకు షోయబ్ అక్తర్ జబర్దస్త్ ఐడియా!

Shoaib Akhtar Suggests Pak Players To Give Indian Players Sleeping Pills
  • ధోనీ బ్యాటింగ్ కు రావొద్దని కామెంట్
  • కోహ్లీ ఇన్ స్టా చూడడం మానెయ్యాలంటూ సూచన
  • హర్భజన్ తో కలిసి ఇంటర్వ్యూలో రావల్పిండి ఎక్స్ ప్రెస్ సరదా కామెంట్లు
ప్రపంచ కప్ మహాసమరంలో ఇండియాపై దాయాది పాకిస్థాన్ కు ఘనమైన రికార్డు లేదన్న సంగతి తెలిసిందే. ఇంతవరకు ఒక్క మ్యాచ్ లోనూ ఆ దేశం గెలిచింది లేదు. ఈ నేపథ్యంలోనే ఇవాళ టీ20 వరల్డ్ కప్ లో ఇండియాతో తలపడనున్న పాక్ ప్లేయర్లకు రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ ఓ జబర్దస్త్ ఐడియా ఇచ్చాడు.


టీమిండియా ఆటగాళ్లకు నిద్రమాత్రలు ఇవ్వాలని సరదాగా వ్యాఖ్యానించాడు. స్పోర్ట్స్ కీడా అనే చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా హర్భజన్ తో కలిసి పాల్గొన్న అతడు.. సరదా వ్యాఖ్యలు చేశాడు. మెంటార్ గా ఉన్న ధోనీ అసలు బ్యాటింగ్ కు రావొద్దన్నాడు. ఇప్పటికీ అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడని కొనియాడాడు. ఇన్ స్టాగ్రామ్ వాడకాన్ని కోహ్లీ ఆపేయాలని సూచించాడు. ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ఆరంభించి ఐదు ఓవర్ల తర్వాత విరుచుకుపడాలని పాక్ బ్యాట్స్ మెన్ కు సూచించాడు. భారత్ ను వీలైనంత తక్కువ స్కోరుకే పరిమితం చేయాలని, బౌలింగ్ లో క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టాలని పేర్కొన్నాడు.
Cricket
Pakistan
Team India
Shoaib Akhtar
Harbhajan Singh
T20 World Cup

More Telugu News