Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 383 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 143 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4 శాతానికి పైగా లాభపడ్డ టాటా స్టీల్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. మొదట్లో మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ చివరకు లాభాలను మూటకట్టుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 383 పాయింట్లు లాభపడి 61,350కి చేరుకుంది. నిఫ్టీ 143 పాయింట్లు పెరిగి 18,268కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (4.13%), టైటాన్ కంపెనీ (3.67%), ఏసియన్ పెయింట్స్ (3.06%), బజాజ్ ఫైనాన్స్ (3.02%), నెస్లే ఇండియా (2.91%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.78%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.06%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.78%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.64%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.43%).