Samantha: సమంతపై కంటెంట్ ను వెంటనే తొలగించండి... యూట్యూబ్ చానళ్లకు కోర్టు ఆదేశం
- విడిపోతున్నట్టు ప్రకటించిన సమంత, నాగచైతన్య
- విపరీతస్థాయిలో కథనాలు
- కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించిన సమంత
- ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేసిన కోర్టు
ఇటీవల సమంత, నాగచైతన్య విడిపోతున్నట్టు ప్రకటించిన సమయంలో వారి విడాకులపై అనేక కథనాలు వచ్చాయి. అయితే సీఎల్ వెంకట్రావు అనే వ్యక్తితో పాటు పలు యూట్యూబ్ చానళ్లు తన వ్యక్తిగత జీవితంపై ఇష్టంవచ్చినట్టు ప్రచారం చేస్తున్నాయంటూ సమంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమె కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించారు. సమంతపై కోర్టులో నేడు విచారణ కొనసాగించింది.
సమంతపై కంటెంట్ ను యూట్యూబ్ చానళ్లు వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది. సీఎల్ వెంకట్రావు సైతం తన కంటెంట్ ను తొలగించాలని కూకట్ పల్లి కోర్టు స్పష్టం చేసింది. యూట్యూబ్ చానళ్లు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడరాదని, అదే సమయంలో సమంత కూడా తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదని న్యాయస్థానం పేర్కొంది.