Bail: డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్... ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా

Two persons gets bail in drugs case
  • సంచలనం సృష్టించిన ముంబయి డ్రగ్స్ కేసు
  • షారుఖ్ తనయుడు ఆర్యన్ సహా పలువురి అరెస్ట్
  • రాజ్ గారియా, సాహులకు బెయిల్
  • పెండింగ్ లో ఆర్యన్ బెయిల్ పిటిషన్ విచారణ
సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో మనీష్ రాజ్ గారియా, అవిన్ సాహులకు ముంబయి ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అటు బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా పడింది. కాగా, బెయిల్ పొందిన మనీష్ రాజ్ గారియా డ్రగ్స్ కేసులో 11వ నిందితుడు. 2.4 గ్రాముల గంజాయిని కలిగి ఉన్నాడంటూ అతడిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బెయిల్ రావడంతో రూ.50 వేల పూచీకత్తు చెల్లించిన మీదట అతడిని విడుదల చేశారు. అవిన్ సాహు వద్ద కూడా మాదకద్రవ్యాలు ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు.

ఆర్యన్ ఖాన్ కేసులా కాకుండా, మనీష్ రాజ్ గారియా కేసులో వాట్సాప్, ఐమెసేజ్ చాటింగులు ఏవీ లేవని అతడి తరఫు న్యాయవాది ముంబయి కోర్టుకు తెలిపారు. అవిన్ సాహు న్యాయవాది కూడా ఇదే తరహా వాదనలతో తన క్లయింటుకు బెయిల్ తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో, వాట్సాప్ చాటింగులే ఆర్యన్ ఖాన్ కేసులో సమస్యాత్మకంగా మారాయన్న విషయం అర్థమవుతోంది.
Bail
Drugs Case
Aryan Khan
Bombay High Court

More Telugu News