YS Vivekananda Reddy: వైయస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు.. నలుగురి పేర్లను పేర్కొన్న సీబీఐ!
- పులివెందుల కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ
- గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్, దస్తగిరిలపై అభియోగాలను మోపిన సీబీఐ
- వీరిని ఆగస్ట్, సెప్టెంబర్ లో అరెస్ట్ చేసినట్టు పేర్కొన్న విచారణ సంస్థ
ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి పులివెందుల కోర్టులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. వివేకా మృతికి నలుగురు వ్యక్తులు కారణమని ఛార్జ్ షీటులో పేర్కొంది. వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, డ్రైవర్ దస్తగిరిలు హత్య చేసినట్టు అభియోగాలు మోపింది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వీరిని అరెస్ట్ చేశామని తెలిపింది. నలుగురు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించామని.. వీరిలో ఇద్దరికి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని పేర్కొంది. ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ కడప సెంట్రల్ జైల్లో ఉన్నారని తెలిపింది.