Low Pressure: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి మూడ్రోజుల వర్ష సూచన
- ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం
- ఈ నెల 30 వరకు విస్తారంగా వర్షాలు
- ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు
దేశంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలో మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ నెల 30వ తేదీ వరకు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయని వివరించింది. రేపు ఎల్లుండి విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని పేర్కొంది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కూడా ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది.