Kim Jong Un: కాస్త తక్కువగా తినండి.. దేశ ప్రజలకు కిమ్ సూచన

Kim Jong Un suggests citizens to consume less food

  • ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార కొరత
  • ఆకాశాన్నంటుతున్న ఆహార ధరలు
  • 2025 వరకు తక్కువ ఆహారాన్ని తీసుకోవాలని సూచన

ఉత్తరకొరియా దేశంలో ఆహార కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయ ఆంక్షలతో ఆ దేశం సతమతమవుతోంది. దేశీయంగా వ్యవసాయ ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ అది సరిపోవడం లేదు. దేశం ఆహార కొరతతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు విమర్శిస్తున్నాయి. దేశ రక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రజల రక్షణకు, ఆహార ఉత్పత్తికి ఇవ్వలేదని విమర్శలు కురిపిస్తున్నాయి.

మరోవైపు కొరియాలో ఆహార కొరత తీవ్రంగా ఉందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం నివేదిక కూడా ఇచ్చింది. అయితే ఈ నివేదికను ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆమోదించలేదు. తమ దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. ఇదే సమయంలో దేశ ప్రజలకు కిమ్ కొన్ని సూచనలు చేశారు. 2025 వరకు అందరూ తక్కువ ఆహారం తీసుకోవాలని సూచించారు. చైనాతో సరిహద్దులు ఓపెన్ కావడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని... అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

  • Loading...

More Telugu News