Andhra Pradesh: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే
- విశాఖ శారదా పీఠానికి 15 ఎకరాల కేటాయింపు
- అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ
- ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రతిపాదనలు
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక అంశాలకు ఆమోదం తెలిపారు.
కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే:
- స్వరూపానందేంద్ర సరస్వతికి చెందిన విశాఖ శారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాల కేటాయింపు
- జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్ కు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపు
- రాష్ట్రంలో ఐదు చోట్ల సెవెన్ స్టార్ పర్యాటక రిసార్ట్ ల ఏర్పాటుకు భూముల కేటాయింపు
- పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం
- జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు
- వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేకశాఖ ఏర్పాటుకు ఆమోదం
- రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ను అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి ఆమోదం
- సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు ఆమోదం
- ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు (యూనిట్ రూ. 2.49 చొప్పున) ప్రతిపాదనకు ఆమోదం
- బీసీ జనాభాను కులాలవారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయం
- విశాఖలో తాజ్ వరుణ్ బీచ్ ప్రాజెక్టుకు ఆమోదం