Aryan Khan: బెయిల్ వచ్చినా.. జైల్లోనే గడుపుతున్న ఆర్యన్ ఖాన్

Aryan Khan still in jail after getting bail
  • ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు
  • ఈ మధ్యాహ్నం బెయిల్ ఆర్డర్ ను చదివి వినిపించనున్న న్యాయమూర్తి
  • బెయిల్ షరతులను తెలియజేయనున్న జడ్జి
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ కేసులో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. నిన్ననే బెయిల్ మంజూరు అయినప్పటికీ ఆర్యన్ ఇంకా ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైల్లోనే ఉన్నారు. బెయిల్ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడమే దీనికి కారణం. హైకోర్టు జడ్జి ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు డీటెయిల్డ్ ఆర్డర్ ను చదివి వినిపించనున్నారు. బెయిల్ కు విధించబోయే షరతులను తెలియజేయనున్నారు.

ఆ తర్వాత బెయిల్ ఆర్డర్స్ జైలుకు వెళతాయి. అనంతరం నిబంధనల ప్రకారం జైల్లో అన్నీ పూర్తయిన తర్వాత ఆర్యన్ విడుదల అవుతారు. మరోవైపు తమ కుమారుడి విడుదల కోసం షారుఖ్, ఆయన భార్య గౌరీ ఖాన్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Aryan Khan
Bollywood
Bail
Drugs

More Telugu News