CPI Ramakrishna: ఎయిడెడ్ విద్యాసంస్థలకు నిధులు నిలిపివేయడం దుర్మార్గం: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

CPI Ramakrishna wrote CM Jagan on aided educational institutions

  • ఎయిడెడ్ సంస్థల విలీనంపై ఆగ్రహం
  • ఫీజుల భారం పెరిగిపోతుందని ఆందోళన
  • ఎయిడెడ్ విద్యాసంస్థలు కొనసాగించాలని డిమాండ్
  • ప్రభుత్వం సమీక్షించుకోవాలని హితవు

ఏపీ సీఎం జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ సంస్థలను కొనసాగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ స్కూళ్లకు నిధులను నిలిపివేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రైవేటీకరిస్తే ఫీజుల భారం పెరిగిపోతుందని ఆందోళన వెలిబుచ్చారు. విద్యారంగ బాధ్యతను విస్మరించేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని రామకృష్ణ విమర్శించారు. ఎయిడెడ్ సంస్థల విలీనంపై రాష్ట్రంలో ఆగ్రహజ్వాలు వెల్లువెత్తుతున్నాయని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని లేఖలో హితవు పలికారు.

  • Loading...

More Telugu News