PM Modi: విధి చాలా క్రూరమైనది... ఇది చనిపోవాల్సిన వయసు కాదు: పునీత్ మృతిపై ప్రధాని మోదీ స్పందన

PM Modi condolences Puneeth Rajkumar demise
  • కన్నడ కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్ మృతి
  • గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన వైనం
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన మోదీ
  • ప్రతిభావంతుడైన నటుడు దూరమయ్యాడని వెల్లడి
కన్నడ అగ్ర కథనాయకుడు పునీత్ రాజ్ కుమార్ (46) హఠాన్మరణం చెందడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విధి ఎంతో క్రూరమైన మలుపు తిరిగి పునీత్ రాజ్ కుమార్ వంటి ప్రతిభావంతుడైన, ఫలప్రదమైన కెరీర్ సొంతం చేసుకున్న నటుడ్ని మనకు దూరం చేసిందని పేర్కొన్నారు. అతడి వయసు చూస్తే చాలా చిన్నదని, చనిపోవాల్సిన వయసు కాదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

రాబోయే తరాలు పునీత్ సినిమాలను, ఆయన నటనను, అద్భుతమైన వ్యక్తిత్వాన్ని తప్పకుండా గుర్తుచేసుకుంటాయని వివరించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తీవ్ర సంతాపం తెలియజేసుకుంటున్నానని వెల్లడించారు. ఈ క్రమంలో పునీత్ రాజ్ కుమార్ దంపతులతో కలిసి ఉన్నప్పటి ఫొటోను మోదీ ట్విట్టర్ లో పంచుకున్నారు.
PM Modi
Puneeth Rajkumar
Demise
Condolences

More Telugu News