Aryan Khan: బెయిల్ పై విడుదలైన ఆర్యన్ ఖాన్.. వీడియో ఇదిగో!

Aryan Khan released from jail
  • డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్
  • దాదాపు నాలుగు వారాల పాటు జైలు జీవితాన్ని గడిపిన ఆర్యన్
  • ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నాడు. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి బెయిల్ పై విడుదల అయ్యాడు. ఆర్యన్ ను జైలు నుంచి రిసీవ్ చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో షారుఖ్ మనుషులు జైలు వద్దకు వచ్చారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ దాదాపు నాలుగు వారాల పాటు జైలు జీవితాన్ని అనుభవించాడు.

గురువారం నాడు ఆర్యన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అదే రోజు బెయిల్ ఆర్డర్ ను విడుదల చేయలేదు. నిన్న మధ్యాహ్నం బెయిల్ ఆర్డర్ ను విడుదల చేసింది. బెయిల్ షరతులను చదివి వినిపించింది. బెయిల్ వచ్చినప్పటికీ రెండు రాత్రులు ఆర్యన్ జైల్లోనే గడిపాడు. నిన్న సాయంత్రం 5.30 గంటల్లోగా బెయిల్ పేపర్లను సమర్పించడంలో ఆర్యన్ లీగల్ టీమ్ విఫలమయింది. దీంతో నిన్న రాత్రి కూడా ఆర్యన్ జైల్లోనే గడిపాడు.  

మరోవైపు ఆర్యన్ విడుదల నేపథ్యంలో... షారుఖ్ ఇంటి వద్దకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆ ప్రాంతమంతా చాలా హడావుడిగా ఉంది. ఆర్యన్ కోసం ఆయన కుటుంబసభ్యులు కూడా తీవ్ర భావోద్వేగంతో ఎదురు చూస్తున్నారు.
Aryan Khan
Bollywood
Shahrukh Khan
Bail

More Telugu News