Brahmanandam: ఈ స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చినందుకు బ్ర‌హ్మానందానికి థ్యాంక్యూ: ఫొటోలు పోస్ట్ చేసిన‌ కృష్ణంరాజు

Brahmanandam gifted his art work to Krishnam Raju
  • శిరిడీ సాయిబాబా పెయింటింగ్ వేసిన బ్ర‌హ్మానందం
  • కృష్ణంరాజుకు అంద‌జేత‌
  • ఆయ‌న‌ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బ్రహ్మీ ఫొటోలు
హాస్య‌న‌టుడు బ్రహ్మానందం గ‌తంలో స్వ‌యంగా వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ వేసి చిరంజీవి, రానా, అల్లు అర్జున్ వంటి హీరోలకు అందించిన విష‌యం తెలిసిందే. ఖాళీ స‌మ‌యాల్లో బ్ర‌హ్మానందం పెయింటింగ్ వేస్తుంటారు. తాజాగా, ఆయ‌న శిరిడీ సాయిబాబా పెయింటింగ్ వేశారు. దానికి ఫ్రేమ్ క‌ట్టించి సీనియ‌ర్ న‌టుడు కృష్ణంరాజుకు అంద‌జేశారు.

కృష్ణంరాజు త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విష‌యాన్ని తెలుపుతూ ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను పోస్ట్ చేశారు. 'ఈ కామెడీ జీనియ‌స్.. ఆర్ట్ జీనియ‌స్ కూడా. ఆయ‌న‌కు అద్భుత‌మైన టాలెంట్ ఉంది. ఈ స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్యూ' అని పేర్కొన్నారు.  

            
Brahmanandam
Tollywood
Krishnam Raju

More Telugu News