Aryan Khan: షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ కు బాంబే హైకోర్టు విధించిన షరతులు ఇవే!

Bombay High Court Conditions to Aryan Khan for his bail
  • డ్రగ్స్ కేసులో బెయిల్ పై విడుదలైన ఆర్యన్ ఖాన్
  • ఆర్యన్ కు పలు షరతులు విధించిన బాంబే హైకోర్టు
  • విచారణ అధికారికి చెప్పకుండా ముంబై వదిలి వెళ్లకూడదని షరతు
డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ అగ్రనటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. జైలు నుంచి ఆయన నేరుగా తన నివాసం 'మన్నత్'కు చేరుకున్నారు. ఆర్యన్ కు బాంబే హైకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

 షరతుల వివరాలు.. 
  • ఆర్యన్ మరోసారి ఇలాంటి డ్రగ్స్ అంశాల్లో కనిపించకూడదు
  • డ్రగ్స్ కేసులోని సహ నిందితులతో ఆర్యన్ మాట్లాడకూడదు
  • నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ (ఎన్డీపీఎస్) కోర్టు అనుమతి లేకుండా దేశాన్ని వదిలి వెళ్లకూడదు
  • కోర్టు ప్రొసీడింగ్స్ గురించి మీడియా లేదా సోషల్ మీడియాతో మాట్లాడకూడదు
  • విచారణ అధికారికి సమాచారం అందించకుండా ముంబైని వదిలి వెళ్లకూడదు
  • ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 11 నుంచి 2 గంటల మధ్య ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాలి
  • కోర్టు విచారణకు క్రమం తప్పకుండా హాజరు కావాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపు ఉంటుంది.
  • ఎన్సీబీ ట్రయల్ ప్రారంభమయిన తర్వాత ఎన్సీబీ కార్యాలయానికి కచ్చితంగా హాజరుకావాలి. విచారణకు విఘాతం కలిగించకూడదు.
  • పైన పేర్కొన్న ఏ ఒక్క కండిషన్ ను ఆర్యన్ అతిక్రమించినా... ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోర్టును ఎన్సీబీ కోరవచ్చు.
Aryan Khan
Shahrukh Khan
Bollywood
Bail
Conditions
Bombay Highcourt

More Telugu News