Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్‌కు కన్నీటి వీడ్కోలు.. తల్లిదండ్రుల సమాధుల పక్కనే అంత్యక్రియలు

Mortal remains of Kannada actor Puneeth Rajkumar Over
  • తెల్లవారుజాము ఐదు గంటలకు ప్రారంభమైన అంతిమ యాత్ర
  • కంఠీరవ స్డేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకు సాగిన యాత్ర
  • పునీత్ మృతదేహానికి సెల్యూట్ చేసిన కర్ణాటక సీఎం
అధికార లాంఛనాల మధ్య కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఈ ఉదయం పూర్తయ్యాయి. తెల్లవారుజామున 5 గంటల సమయంలో పునీత్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కంఠీరవ స్టేడియం నుంచి కఠీరవ స్టూడియో వరకు భారీ కాన్వాయ్ నడుమ అంతిమ యాత్ర నిర్వహించారు. కుటుంబ సభ్యులు, యశ్, సుదీప్ తదితర సినీ నటులు, మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, సిద్దరామయ్య తదితర రాజకీయ నాయకులు, వేలాది మంది అభిమానులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

కంఠీరవ స్టూడియోలోని పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే పునీత్‌ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై.. పునీత్ పార్థివ దేహానికి సెల్యూట్ చేశారు. తాను ఎత్తుకుని ఆడించిన తన సోదరుడు పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ శివరాజ్ కుమార్ రోదించారు. పునీత్ భార్య అశ్విన్, ఇద్దరు పిల్లలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
Puneeth Rajkumar
Karnataka
Sandalwood
Bengaluru
Sree Kanteerava Studios

More Telugu News