Rakesh Tikait: ప్రభుత్వ ఆఫీసులను మార్కెట్లు చేస్తాం.. కేంద్ర ప్రభుత్వానికి రాకేశ్ తికాయత్ హెచ్చరిక

Rakesh Tikait Warns Govt They will Turn Govt Offices Into Mandis
  • ఢిల్లీ సరిహద్దుల నుంచి పంపొద్దంటూ వార్నింగ్
  • ఆ ప్రయత్నాలను మానుకోవాలని హితవు
  • కలెక్టరేట్లు, పోలీస్ స్టేషన్ల ముందు టెంట్లు వేస్తామని హెచ్చరిక
ఢిల్లీ సరిహద్దుల నుంచి తమను పంపించాలని చూస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో ఏడాదిన్నరగా రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో సరిహద్దుల్లో టెంట్లను తీసేశారు. పోలీసులు బారికేడ్లను తొలగించారు.

అయితే, తాము సరిహద్దుల నుంచి వెళ్లబోమని రాకేశ్ తికాయత్ అన్నారు. తమను బలవంతంగా పంపించే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. లేదంటే దేశంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ‘వ్యవసాయ మార్కెట్లు’గా మారుస్తామని హెచ్చరించారు. సరిహద్దుల్లోని టెంట్లను తీసేస్తే పోలీస్ స్టేషన్లు, జిల్లా కలెక్టరేట్ల ముందు వేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

రోడ్లకు అడ్డంగా బారికేడ్లు, టెంట్లు వేయడం పౌరుల ప్రాథమిక హక్కులను హరించడమేనని గత వారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే సరిహద్దుల్లోని రోడ్లను తెరవాలని ఆదేశించింది. దీంతో అధికారులు టిక్రి, ఘాజియాబాద్ సరిహద్దుల్లో రోడ్లపై పెట్టిన బారికేడ్లను అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలోనే తికాయత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Rakesh Tikait
Farm Laws
BKU
New Delhi

More Telugu News