India: శత్రు క్షిపణులను తునాతునకలు చేసేసే ‘విశాఖపట్నం’.. నౌకాదళ అమ్ములపొదిలో శక్తిమంతమైన యుద్ధనౌక

Navy Receives First Vishakhapatnam Missile Destroyer

  • తొలి నౌకను అందించిన మజ్గాన్ డాక్
  • నాలుగు నౌకల నిర్మాణానికి ఒప్పందం
  • 75 శాతం దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి
  • జలాంతర్గాముల వినాశక రాకెట్ లాంచర్లు

భారత నౌకాదళ అమ్ములపొదిలో అత్యంత శక్తిమంతమైన నౌక వచ్చి చేరింది. శత్రు క్షిపణులను తునాతునకలు చేసేసే తొలి ‘విశాఖపట్నం పీ15బీ’ యుద్ధ నౌక.. నేవీ చేతికి అందింది. మజ్గాన్ డాక్ లిమిటెడ్ తయారు చేసిన ఈ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్.. అక్టోబర్ 28న అందినట్టు నిన్న నేవీ అధికారికంగా ప్రకటించింది.

విశాఖపట్నం క్లాస్ కు చెందిన ఈ ఓడల తయారీకి  ‘ప్రాజెక్ట్ 15బీ’ పేరిట 2011 జనవరిలోనే ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా నాలుగు నౌకలను రూపొందించనున్నారు. కోల్ కతా క్లాస్ ‘ప్రాజెక్ట్ 15ఏ’ నౌకలకు కొనసాగింపుగా ప్రాజెక్ట్ 15బీ నౌకలను అభివృద్ధి చేస్తున్నారు. భారత నౌకాదళానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్స్ దీనికి రూపాన్నిచ్చింది. ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ తయారు చేసింది. విశాఖపట్నం, మార్ముగావ్, ఇంఫాల్, సూరత్ లలో ఈ నౌకలను బందోబస్త్ కింద పెట్టనున్నారు.


ఇవీ నౌక ప్రత్యేకతలు..


  • పొడవు: 16 మీటర్లు
  • బరువు: 7,400 టన్నులు
  • వేగం: గంటకు 55 కిలోమీటర్లు (30 నాట్స్)
  • 75 శాతం దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారీ
  • బెంగళూరులోని బీఈఎల్ తయారు చేసిన నేల నుంచి గగనతలానికి ప్రయోగించే మధ్యశ్రేణి క్షిపణులు
  • అత్యంత శక్తిమంతమైన అధునాతన బ్రహ్మోస్ సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణులు
  • ముంబైలోని లార్సన్ అండ్ టూబ్రో తయారు చేసిన దేశీయ టార్పిడో ట్యూబ్ లాంచర్స్
  • ముంబైలోని లార్సన్ అండ్ టూబ్రో తయారు చేసిన దేశీయ జలాంతర్గామి వినాశక రాకెట్ లాంచర్లు
  • హరిద్వార్ లోని బీహెచ్ఈఎల్ తయారు చేసిన 76 ఎంఎం ర్యాపిడ్ గన్ మౌంట్
 

  • Loading...

More Telugu News