Trains: నవంబరు 1 నుంచి కడప మీదుగా మరో రెండు రైళ్ల రాకపోకలు

Two trains will be halt in few stations in Kadapa districts

  • పలు చోట్ల ఆగనున్న లోకమాన్య తిలక్, చెన్నై-ముంబయి రైళ్లు
  • కడప జిల్లా ప్రజలకు సౌకర్యవంతం
  • రాకపోకల వివరాలు తెలిపిన సీసీఐ
  • సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచన

కడప మీదుగా రేపటి నుంచి మరో రెండు రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని కడప రైల్వే సీసీఐ ఎం.యానాదయ్య వెల్లడించారు. ఈ రెండు రైళ్లు కడప జిల్లాలో పలు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయని తెలిపారు.

నెంబరు 01459 ముంబయి-చెన్నై (డైలీ) రైలు ముంబయిలో మధ్యాహ్నం 12.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.59 గంటలకు కడప జిల్లా ఎర్రగుంట్లకు, 4.43 గంటలకు కడపకు, 5.29 గంటలకు రాజంపేటకు చేరుకుంటుందని వివరించారు.

ఇక నెంబరు 01460 చెన్నై-ముంబయి (డైలీ) రైలు చెన్నైలో మధ్యాహ్నం 1.25 గంటలకు బయల్దేరి రైల్వే కోడూరుకు సాయంత్రం 4.44 గంటలకు, రాజంపేటకు 5.09 గంటలకు, కడపకు 5.53 గంటలకు, ఎర్రగుంట్లకు 6.29 గంటలకు చేరుకుంటుందని తెలిపారు.

అటు, నెంబరు 01479 లోకమాన్య తిలక్-చెన్నై (వీకెండ్) రైలు ముంబయి శివారులోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి మధ్యాహ్నం 1.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున కడప జిల్లా ఎర్రగుంట్లకు 4.59 గంటలకు, కడపకు 5.43 గంటలకు చేరుకుంటుంది.

నెంబరు 01480 చెన్నై-లోకమాన్య తిలక్ (వీకెండ్) రైలు చెన్నైలో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి రాత్రి 8.23 గంటలకు కడపకు, 8.59 గంటలకు ఎర్రగుంట్లకు చేరుకుంటుందని సీసీఐ వివరించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News