Tremors: తెలంగాణలో పలు చోట్ల భూప్రకంపనలు
- తెలంగాణలో తరచుగా ప్రకంపనలు
- ఇటీవల మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కంపించిన భూమి
- నేడు జగిత్యాల, రామగుండం ప్రాంతాల్లో ప్రకంపనలు
- ప్రజల్లో ఆందోళన
తెలంగాణలో ఇటీవల మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భూప్రకంపనలు రావడం తెలిసిందే. నేడు మరోసారి భూమి కంపించింది. ఈసారి జగిత్యాల, రామగుండం ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. సాయంత్రం 6.49 గంటలకు భూమి 3 సెకన్ల పాటు కంపించింది. భూప్రకంపనలతో జగిత్యాల, రామగుండం ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. కాగా, ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది.