Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 832 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 258 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
- 7.75 శాతం లాభపడ్డ ఇండస్ ఇండ్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 832 పాయింట్లు పెరిగి 60,138కి ఎగబాకింది. నిఫ్టీ 258 పాయింట్లు లాభపడి 17,929 వద్ద స్థిరపడింది. రియాల్టీ, టెలికామ్, మెటల్ స్టాకులు 3 శాతానికి పైగా లాభపడగా... ఈరోజు అన్ని సూచీలు లాభాల్లోనే ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (7.75%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.91%), భారతి ఎయిర్ టెల్ (3.80%), టాటా స్టీల్ (3.71%), టెక్ మహీంద్రా (3.10%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-1.74%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.50%), నెస్లే ఇండియా (-0.60%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.03%).