Appalaraju: పవన్ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని సూచిస్తున్నాయి: మంత్రి అప్పలరాజు

Pawan Kalyan comments showing his innocence says Appalaraju

  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయాలనేని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
  • బీజేపీని వదిలేసి వైసీపీని పవన్ విమర్శిస్తున్నారు
  • తిరుపతి, బద్వేల్ ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు మద్దతిచ్చారు?

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమిస్తున్న వారికి జనసేనాని పవన్ కల్యాణ్ సంఘీభావాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న వైజాగ్ వెళ్లిన పవన్ ఉద్వేగపూరితమైన ప్రసంగం చేస్తూ, వైసీపీపై మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏదో ఒకటి తేల్చుకోవాలని... వారం రోజులు టైమ్ ఇస్తున్నానని అన్నారు. ఆ తర్వాత మీకు గడ్డుకాలమేనని వైసీపీని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో పవన్ పై ఏపీ మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ఇన్ని రోజులు గుడ్డి గాడిద పళ్లు తోమారా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలనుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని... అలాంటప్పుడు బీజేపీని ప్రశ్నించాలని అన్నారు.
 
బీజేపీని పవన్ కల్యాణ్ ఒక్క మాట కూడా అనడం లేదని అప్పలరాజు విమర్శించారు. వ్రైవేటీకరణ అంశంలో వైసీపీకి సంబంధం లేకపోయినా తమ పార్టీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్న బీజేపీకి తిరుపతి, బద్వేల్ ఎన్నికల్లో పవన్ ఎలా మద్దతిచ్చారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలు ఆయన అజ్ఞానాన్ని సూచిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News