Balakrishna: గీతా ఆర్ట్స్ బ్యానర్లో బాలకృష్ణ?

Balakrishna in Allu Aravind Movie
  • 'ఆహా' షో వ్యాఖ్యాతగా బాలకృష్ణ
  • ఈ షో పైనే అల్లు అరవింద్ దృష్టి
  • త్వరలోనే బాలకృష్ణతో సినిమా
  • అందరిలో పెరుగుతున్న ఆసక్తి  
ఇప్పుడు అంతా 'ఆహా'లో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' షో ను గురించే మాట్లాడుకుంటున్నారు. కర్టైన్ రైజర్ ను వదిలిన దగ్గర నుంచి అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ షో కొత్త రికార్డులను సృష్టిస్తుందని అంటున్నారు. ఈ షోతో సబ్ స్క్రైబర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు.

ఇక ఈ షో సంగతి అలా ఉంచితే గీతా ఆర్ట్స్ లో బాలకృష్ణ ఒక సినిమా చేసే చాన్స్ ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. కర్టైన్ రైజర్ లో వేదికపై బాలకృష్ణ మాట్లాడుతూ, అల్లు ఫ్యామిలీతో తమకి గల అనుబంధాన్ని చెప్పడంతో, ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందనే ప్రచారం బలం పుంజుకుంటోంది.

ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను నిర్మించడంలో అల్లు అరవింద్ బిజీగా ఉన్నారు. అలాగే ఓటీటీ కంటెంట్ ను సెట్ చేసే పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు. ఈ పనులు ఒక కొలిక్కి వచ్చాక బాలకృష్ణతో సినిమా మొదలవుతుందని గట్టిగానే చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.
Balakrishna
Allu Aravind
Tollywood

More Telugu News