Amit Shah: బండి సంజయ్ కి అమిత్ షా ఫోన్... హుజూరాబాద్ మనదే అని చెప్పిన సంజయ్

Amit Shah phone call to Bandi Sanjay
  • హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
  • కొనసాగుతున్న కౌంటింగ్
  • బండి సంజయ్ ని వివరాలు అడిగిన అమిత్ షా
  • కార్యకర్తలు ఎంతో శ్రమించారన్న బండి సంజయ్
  • అభినందనలు తెలిపిన అమిత్ షా
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉండడం పట్ల బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. కొన్నాళ్ల కిందట దుబ్బాకలో గెలిచిన తీరులోనే హుజూరాబాద్ కూడా తమ కైవసం అవుతోందన్న సంతోషం తెలంగాణ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.

తాజాగా, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి ఫోన్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సరళిని అడిగి తెలుసుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం బీజేపీ ఖాతాలో చేరుతోందని బండి సంజయ్ ఆయనకు తెలిపారు. కార్యకర్తలు తీవ్రంగా శ్రమించడం వల్లే హుజూరాబాద్ లో బీజేపీ విజయపథంలో పయనిస్తోందని బండి సంజయ్ వివరించారు. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండడం పట్ల అమిత్ షా ముందస్తు అభినందనలు తెలిపారు.
Amit Shah
Bandi Sanjay
Huzurabad
BJP
Etala Rajendar
By Elections

More Telugu News