Australia: బంగ్లాదేశ్ ను 73 పరుగులకు కుప్పకూల్చిన ఆసీస్... జంపాకు 5 వికెట్లు

Australia bundled out Bangladesh for seventy three runs
  • టీ20 వరల్డ్ కప్ లో నేడు ఆసీస్ వర్సెస్ బంగ్లాదేశ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
  • 15 ఓవర్లలో ముగిసిన బంగ్లా ఇన్నింగ్స్
  • సమష్టిగా సత్తా చాటిన ఆసీస్ బౌలర్లు
  • చెరో రెండు వికెట్లు తీసిన స్టార్క్, హేజెల్ వుడ్
టీ20 వరల్డ్ కప్ గ్రూప్-1లో సెమీస్ బెర్తుపై ఆశలు పెట్టుకున్న ఆస్ట్రేలియా నేడు బంగ్లాదేశ్ తో తలపడుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ ను 73 పరుగులకు కుప్పకూల్చింది. ఆసీస్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 5 వికెట్లు తీయడం విశేషం. మిచెల్ స్టార్క్ 2, జోష్ హేజెల్ వుడ్ 2, గ్లెన్ మాక్స్ వెల్ 1 వికెట్ తీశారు.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో షమీమ్ హుస్సేన్ అత్యధికంగా 19 పరుగులు చేశాడు. ఓపెనర్ మహ్మద్ నయీం 17, కెప్టెన్ మహ్మదుల్లా 16 పరుగులు సాధించారు. ఆరంభ ఓవర్లలో స్టార్క్, హేజెల్ వుడ్ తమ పేస్ తో బంగ్లా బ్యాట్స్ మెన్ ను హడలెత్తించగా, ఆ తర్వాత జంపా తన స్పిన్ మాయాజాలంతో బంగ్లా లోయరార్డర్ ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. దాంతో బంగ్లాదేశ్ జట్టు 15 ఓవర్లలో 73 పరుగులకు ఆలౌట్ అయింది.
Australia
Bangladesh
Adam Zampa
Super-12
Group-1
T20 World Cup

More Telugu News