Whatsapp: మెసేజ్ డిలీటింగ్ టైమ్ ను పెంచుతున్న వాట్సాప్!

Whatsapp increasing time limit of delete for everyone option
  • డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ టైమ్ లిమిట్ పెంచుతున్న వాట్సాప్
  • పరీక్షల దశలో ఉన్న ఫీచర్
  • గంట తర్వాత కూడా అవతలి వ్యక్తికి పంపిన మెసేజ్ ను డిలీట్ చేసే అవకాశం
ప్రజల జీవితంలో వాట్సాప్ అనేది ఒక భాగమైపోయింది. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు వాట్సాప్ ను జనాలు ఎన్నిసార్లు చెక్ చేసుకుంటారో అందరికీ తెలిసిందే. వాట్సాప్ కూడా తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందిస్తోంది. తాజాగా 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్ టైమ్ లిమిట్ ను పొడిగించబోతోంది. మెసేజ్ పంపిన నెల రోజుల తర్వాత కూడా అవతలి వ్యక్తి ఛాట్ పేజ్ నుంచి మెసేజ్ ను డిలీట్ చేయవచ్చు.

ప్రస్తుతం డిలీట్ ఫర్ ఎవ్రీవర్ ఆప్షన్ గంట వరకు మాత్రమే ఉంది. గంట తర్వాత కేవలం సొంత పేజ్ లో మాత్రమే డిలీట్ చేసే అవకాశం ఉంది. గంట తర్వాత అవతలి వ్యక్తి ఛాట్ పేజ్ లో మెసేజ్ డిలీట్ చేసే అవకాశం లేదు. తాజాగా ఈ టైమ్ లిమిట్ ను వాట్సాప్ పెంచనుండటం వినియోగదారులకు సంతోషం కలిగించే అంశమే. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ ను త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.
Whatsapp
Delete for Everyone Option

More Telugu News