New Zealand: నమీబియాతో న్యూజిలాండ్ పోరు... కివీస్ ఓడితే భారత్ కు చాన్స్

New Zeland takes on Namibia
  • షార్జాలో మ్యాచ్
  • ఈ మ్యాచ్ ఫలితంపై టీమిండియా అభిమానుల్లో ఉత్కంఠ
  • టీమిండియా సెమీస్ బెర్తుకు అడ్డంకిగా ఉన్న కివీస్
  • కివీస్ ఓడిపోవాలని కోరుకుంటున్న భారత అభిమానులు
టీ20 వరల్డ్ కప్ లో నేడు గ్రూప్-2లో న్యూజిలాండ్, నమీబియా పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిస్తే న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుతుంది. ఓడిపోతే మాత్రం టీమిండియాకు లాభిస్తుంది. తన చివరి రెండు మ్యాచ్ లను టీమిండియా భారీ తేడాతో నెగ్గితే న్యూజిలాండ్ ను వెనక్కినెట్టి సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంటుంది. ఇది జరగాలంటే నేడు నమీబియా అద్భుతం చేయాలి! ఇవాళ్టి మ్యాచ్ కు షార్జా ఆతిథ్యమిస్తోంది. న్యూజిలాండ్ పై టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్ లో కివీస్ ఓడిపోవాలని భారత్ అభిమానులు కోరుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ మ్యాచ్ లో కాకపోయినా, తన తదుపరి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ చేతిలోనైనా న్యూజిలాండ్ ఓడిపోవాలన్నది భారత అభిమానుల ఆశ! ఆప్ఘనిస్థాన్ జట్టుకు సంచలనాలు కొత్తేమీ కాదు. ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఎల్లుండి జరగనుంది. మరి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి!
New Zealand
Namibia
Team India
Semis
T20 World Cup

More Telugu News