Namibia: న్యూజిలాండ్ ను 163 పరుగులకు పరిమితం చేసిన నమీబియా బౌలర్లు

Namibia bowlers restricts New Zealand
  • టీ20 వరల్డ్ కప్ లో కివీస్ వర్సెస్ నమీబియా
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్
  • రాణించిన గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషామ్
  • చివరి ఓవర్లో 18 పరుగులు రాబట్టిన కివీస్
షార్జాలో న్యూజిలాండ్, నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసింది. భారీ స్కోరు సాధించకుండా న్యూజిలాండ్ ను నమీబియా బౌలర్లు కట్టడి చేశారు. చివరి ఓవర్లో 18 పరుగులు రావడంతో కివీస్ స్కోరు 150 మార్కు దాటింది.

ఓ దశలో కివీస్ జట్టు 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా... గ్లెన్ ఫిలిప్స్ (39 నాటౌట్), జేమ్స్ నీషామ్ (35 నాటౌట్) జోడీ ఆదుకుంది. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా ఆడారు. ఫిలిప్స్ 3 సిక్సులు బాదగా, నీషామ్ 2 సిక్సులు కొట్టాడు.

అంతకుముందు, ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ 18, డారిల్ మిచెల్ 19 పరుగులు చేశారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 28 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్ కాన్వే 17 పరుగులకు అవుటయ్యాడు. నమీబియా బౌలర్లలో స్కోల్జ్ 1, వీజ్ 1, ఎరాస్మస్ 1 వికెట్ తీశారు.
Namibia
New Zealand
Super-12
Group-2

More Telugu News