Chiranjeevi: ఇడుగో సాయిధరమ్ తేజ్... మేనమామల నడుమ చిరునవ్వులు చిందిస్తున్న మెగా హీరో

Chiranjeevi presents Sai Dharam Tej after recovery
  • సెప్టెంబరు 10న సాయిధరమ్ తేజ్ కు రోడ్డుప్రమాదం
  • తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలు
  • అపోలో ఆసుపత్రిలో కాలర్ బోన్ కు సర్జరీ
  • డిశ్చార్జి అయిన తర్వాత ఇంటికే పరిమితం
  • దీపావళి వేడుకలకు చిరంజీవి ఇంటికి వచ్చిన వైనం
మెగా హీరో సాయిధరమ్ తేజ్ గత సెప్టెంబరు నెలలో రోడ్డు ప్రమాదానికి గురికావడం తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ మీడియాకు కనిపించలేదు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత తన నివాసానికే పరిమితం అయ్యాడు. ఇన్నాళ్లకు సాయిధరమ్ తేజ్ పబ్లిగ్గా దర్శనమిచ్చాడు. చిరంజీవి నివాసంలో జరిగిన దీపావళి వేడుకలకు విచ్చేశాడు.

దీనిపై చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించి సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడని మెగాస్టార్ వెల్లడించారు. మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ అని పేర్కొన్నారు. ఈ మేరకు చిరంజీవి ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. అందులో చిరంజీవి... తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ భుజంపై చెయ్యేసి ఉండగా, పక్కనే పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ తనయుడు అకీరా నందన్ ఉన్నారు.
Chiranjeevi
Sai Dharam Tej
Road Accident
Recovery

More Telugu News