Team New Zealand: బాబ్బాబు.. కొంచెం గెలవండి ప్లీజ్.. ఆఫ్ఘన్ పై తెగ మీమ్స్!

Memes Rounding in The Social Circles On NZ and Afghan Match
  • ఇవాళ న్యూజిలాండ్ తో ఆఫ్ఘన్ మ్యాచ్
  • ఆఫ్ఘన్ గెలిస్తేనే ఇండియాకు సెమీస్ చాన్స్
  • మీమ్స్ క్రియేట్ చేస్తున్న నెటిజన్లు
  • వీడియోలు పోస్ట్ చేసిన పలువురు క్రికెటర్లు
టీమిండియా సెమీస్ చేరాలంటే ఇవాళ న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆఫ్ఘనిస్థాన్ గెలిచి తీరాలి. దీంతో ఇప్పుడు యావత్ భారత్ మొత్తం ఆఫ్ఘన్ వెనుకే ఉంది. ప్రతి భారతీయుడూ ఆఫ్ఘనిస్థాన్ కు మద్దతుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెగ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఇవాళ ఆఫ్ఘనిస్థాన్ గెలిచినా.. మన నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంటేనే మనం సెమీస్ చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం మన రన్ రేట్.. ఆఫ్ఘన్ కన్నా మెరుగ్గానే ఉన్నా ఆ జట్టు గెలిస్తే మనకన్నా మెరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి నమీబియాపై మనం భారీగా గెలవాల్సి ఉంటుంది.


ఈ నేపథ్యంలోనే బాబ్బాబు.. గెలవండి ప్లీజ్ అంటూ ఆఫ్ఘన్ మ్యాచ్ పై నెటిజన్లు మీమ్స్ చేస్తున్నారు. టాలీవుడ్, సినిమాల్లోని ఫైట్ సీన్లకు డైలాగులు జోడిస్తూ సెటైర్లు పేలుస్తున్నారు. పలువురు క్రికెటర్లూ వీడియోలు పోస్ట్ చేసి మీమ్స్ సృష్టిస్తున్నారు. ధోనీ, కోహ్లీ, రోహిత్ కలిసి రషీద్ ఖాన్ జుట్టు దువ్వుతున్న ఫొటోను పోస్ట్ చేశారు. అప్పట్లో ఒకే ఒక్క అభిమాని ఉంటే.. ఇప్పుడు కోట్లాది మంది అభిమానులున్నారంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. మరికొందరు టామ్ అండ్ జెర్రీ ఫొటోలను షేర్ చేస్తున్నారు.


Team New Zealand
Afghanistan
Team India
Memes
T20 World Cup

More Telugu News