Telangana: తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ చార్జీలు.. ఎంతంటే!
- ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
- కిలోమీటరుకు ఆర్డినరీ బస్సుల్లో 25 పైసలు, ఎక్స్ ప్రెస్ ఆపై సర్వీసులకు 30 పైసల పెంపు
- సీఎం కేసీఆర్ ఓకే అంటే త్వరలోనే అమలు
మరి కొన్ని రోజుల్లో తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఇవాళ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, అధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే అధికారులు చార్జీల పెంపుపై ప్రతిపాదనలను సిద్ధం చేశారు.
పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులపై కిలోమీటరుకు 25 పైసలు, ఎక్స్ ప్రెస్, ఆపై సర్వీసులు, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ లలో కిలోమీటరుకు 30 పైసలు పెంచాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపనున్నారు. ఆయన ఓకే అన్న తర్వాత చార్జీలను పెంచనున్నారు.