Prime Minister: కాలుష్య నియంత్రణకు భారతీయుడి పరికరం.. దానిపై ప్రధాని మోదీ ఉత్సుకత

PM Modi Meets Youth Who Invented Pollution Control Device

  • ఢిల్లీ మెకానికల్ ఇంజనీర్ ఘనత
  • ప్రిన్స్ విలియం ఎర్త్ షాట్ అవార్డు
  • ఇప్పటికే ఉత్తరాఖండ్ లో అతడి పరికరం వినియోగం

న్యూఢిల్లీకి చెందిన విద్యుత్ మోహన్ అనే మెకానికల్ ఇంజనీర్ తయారు చేసిన ఓ చిన్న పరికరం.. కాలుష్యానికి పరిష్కారం అంటున్నారు దేశాధినేతలు. ఆవిష్కరణకు ప్రఖ్యాత ఎర్త్ షాట్ అవార్డు (బ్రిటన్ ప్రిన్స్ విలియమ్ ప్రారంభించిన అవార్డు) కూడా ఇటీవల వరించింది. ఢిల్లీలో పొల్యూషన్ వల్ల విద్యుత్ మోహన్, ఆయన నానమ్మ అనారోగ్యానికి గురయ్యేవారు. దీంతో దానికి పరిష్కారం కోసం విద్యుత్ ప్రయత్నించారు. టన్నుల కొద్దీ వ్యర్థాలను పునరుత్పాదక ఇంధనం, ఎరువులుగా మార్చే ఓ ట్రాక్టర్ పరికరాన్ని ఆయన కనిపెట్టారు. వరి గడ్డి, కొబ్బరి చిప్పలను మండించి విద్యుత్ నూ తయారు చేయవచ్చు.

ఇప్పటికే ఉత్తరాఖండ్ లో ఈ పరికరాన్ని పైలట్ ప్రాజెక్టుగా వినియోగిస్తున్నారు. చాలా ప్రాంతాల్లోనూ టెస్ట్ చేస్తున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల కర్బన ఉద్గారాలను 98 శాతం తగ్గించొచ్చు. దాని వల్ల ఉద్యోగాలనూ సృష్టించవచ్చని చెబుతున్నారు. ఈ టెక్నాలజీ కోసం takachar.com అనే ఓ సంస్థను స్థాపించి దాని ద్వారా పొల్యూషన్ ను నియంత్రించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవల జర్మనీలోని గ్లాస్గోలో నిర్వహించిన కాప్ 26 సదస్సులోనూ ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను కలిశారు. కేవలం 2 నిమిషాలే ఆయన తనతో మాట్లాడారని విద్యుత్ మోహన్ చెప్పారు. రెండు నిమిషాల మీటింగే అయినా తన ఆవిష్కరణకు ప్రభుత్వ ప్రోత్సాహం దొరుకుతుందన్న నమ్మకం పెరిగిందన్నారు. తన ప్రాజెక్టును మరింత భారీగా నిర్వహించేందుకు అవకాశం దొరుకుతుందని ఆయన తెలిపారు.

ఆ రెండు నిమిషాల్లోనే ప్రధాని అన్ని విషయాలను తెలుసుకున్నారని చెప్పారు. ఎలా పనిచేస్తుంది? రైతులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఎప్పుడు..ఎక్కడ..ఎలా మెషీన్ ను తయారు చేస్తారు? అని మోదీ తనను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఆయన తన పరిశోధనపై చాలా ఉత్సుకతతో ఉన్నారన్నారు. ప్రస్తుతం తమ ప్రయత్నమంతా ప్రాజెక్టును పెద్ద స్థాయికి తీసుకెళ్లడమేనని చెప్పారు.

  • Loading...

More Telugu News