South Central Railway: మరో 12 రైళ్లను అన్‌రిజర్వుడు ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చేసిన రైల్వే

Another 12 Trains Changed as Express Rails
  • తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి
  • టికెట్ చార్జీలు పెరగడంతోపాటు స్టేషన్ల సంఖ్య కూడా పరిమితం
  • తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగింపు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే ఓ శుభవార్త, ఓ చేదువార్త చెప్పింది. కరోనా కారణంగా నిలిచిపోయిన 12 ప్యాసింజర్ రైళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది. అయితే, ఇకపై ఇవి అన్‌రిజర్వుడు ఎక్స్‌ప్రెస్‌లుగా నడుస్తాయని పేర్కొంది. ఫలితంగా టికెట్ చార్జీలు పెరగడంతోపాటు అవి ఆగే స్టేషన్ల సంఖ్య కూడా పరిమితం కానుంది.

ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారిన ప్యాసింజర్ రైళ్లు ఇవే..

* తెనాలి-రేపల్లె-తెనాలి (07873/07874), రేపల్లె-తెనాలి-రేపల్లె (07875/07876). ఇది ఈ నెల 13 నుంచి అందుబాటులోకి వస్తుంది.

* మిర్యాలగూడ-నడికుడి-మిర్యాలగూడ (07277/07273). ఈ మెమూ రైలు ఈ నెల 11 నుంచి అందుబాటులోకి వస్తుంది.

*నర్సాపూర్-విజయవాడ-నర్సాపూర్ (07044/07045). ఈ డెమూ రైలు 14 నుంచి పట్టాలపైకి వస్తుంది.

* కాచిగూడ-రొటెగాం-కాచిగూడ (07571/07572) ఈ నెల 15 నుంచి అందుబాటులోకి వస్తుంది.

* కాచిగూడ-మిర్యాలగూడ-కాచిగూడ (07276/07974). ఇది ఈ నెల 11 నుంచి సేవలు ప్రారంభిస్తుంది.
South Central Railway
Passenger Trains
Andhra Pradesh
Telangana

More Telugu News