Andhra Pradesh: తిరుమల కొండకు ఎలక్ట్రిక్ బస్సు.. ఇవిగో ఫొటోలు
- 50 బస్సులను నడిపేందుకు నిర్ణయం
- 100 బస్సులకు ఏపీఎస్ఆర్టీసీ ఆర్డర్
- ఒలెక్ట్రాతో రూ.140 కోట్ల డీల్
తిరుమల కొండపై కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ బస్సులను నడిపేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ ఒలెక్ట్రా సంస్థకు 100 బస్సులను ఆర్డర్ పెట్టగా.. అందులో 50 బస్సులను తిరుమల ఘాట్ రోడ్డులో నడపాలని నిర్ణయం తీసుకుంది. తిరుపతి నుంచి నెల్లూరు, కడప, మదనపల్లికి మరో 50 బస్సులను ఇంటర్ సిటీ సర్వీసులుగా నడపనున్నారు.
12 నెలల్లో బస్సులను డెలివరీ చేసేలా ఒలెక్ట్రాతో ప్రభుత్వం రూ.140 కోట్లతో ఒప్పందం చేసుకుంది. 12 ఏళ్ల పాటు ఆ బస్సుల మెయింటెనెన్స్ ను సంస్థే చూడనుంది. ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో 35 మంది ప్రయాణం చేసేందుకు వీలుంటుంది.