Punya Thidhi: పునీత్ కు ఇష్టమైన వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పుణ్యతిథి నిర్వహించిన కుటుంబ సభ్యులు

Punya Thidhi performed by family members at Puneeth Rajkumar memorial
  • గత నెలలో మరణించిన పునీత్ రాజ్ కుమార్
  • ఆచారాలు పాటిస్తున్న కుటుంబ సభ్యులు
  • పునీత్ సమాధి వద్ద పుణ్యతిథి నిర్వహణ
  • 30 రకాల వంటకాల సమర్పణ
కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గత నెలలో మరణించగా, హిందూ మతాచారాలను అనుసరించి కుటుంబ సభ్యులు వివిధ క్రతువులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పునీత్ మరణించిన అనంతరం 11వ రోజున ఆయన సమాధి వద్ద పుణ్యతిథి కార్యక్రమం నిర్వహించారు. పునీత్ అమితంగా ఇష్టపడే శాకాహార, మాంసాహార వంటకాలను సమాధి వద్ద ఉంచారు. మొత్తం 30 రకాల వంటకాలను సిద్ధం చేసి సమాధి వద్ద సమర్పించారు.

ఈ పుణ్యతిథి కార్యక్రమానికి పునీత్ అర్ధాంగి అశ్విని, కుమార్తెలు వందిత, ధృతి, సోదరులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నటుడు శివరాజ్ కుమార్ మరోసారి తమ్ముడి విషాదాంతంతో తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. పునీత్ తనకు బిడ్డలాంటి వాడని, పునీత్ పద్మశ్రీ కాదు అమరశ్రీ అని పేర్కొన్నారు. పునీత్ ఎక్కడికీ వెళ్లలేదని, ప్రతి ఒక్కరి మనసులో సజీవంగా ఉన్నాడని అన్నారు.
Punya Thidhi
Puneeth Rajkumar
Demise
Bengaluru
Karnataka

More Telugu News