Vijay Devarakonda: హిందీలో విజయ్ దేవరకొండ డబ్బింగ్!

Vijay Devarakonda lends his voice for Hindi version of Liger
  • పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ
  • మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే 'లైగర్'
  • విజయ్ సరసన నాయికగా అనన్య పాండే
  • హిందీ వెర్షన్ కి డబ్బింగ్ చెప్పనున్న విజయ్    
ఇటీవలి కాలంలో యూత్ లో బాగా క్రేజ్ తెచ్చుకున్న హీరోగా విజయ్ దేవరకొండను చెప్పుకోవాలి. అతను ఎంచుకునే కథలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. దానికి తోడు తనదైన స్టయిల్ లో అభినయం ఆయనకు మంచి ఫాలోయింగును తెస్తోంది. ఈ క్రమంలో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'లైగర్'! ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. హిందీలో ఈ చిత్రానికి ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వామిగా వున్నారు.

మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో విజయ్ బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు. చివరి షెడ్యూలు షూటింగు కోసం ఈ చిత్రం యూనిట్ త్వరలో అమెరికా వెళుతోంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇదిలావుంచితే, ఈ చిత్రం హిందీ వెర్షన్ కి సంబంధించిన ఒక అప్ డేట్ వినిపిస్తోంది. అదేమిటంటే, హీరో విజయ్ దేవరకొండ హిందీ వెర్షన్లో తన పాత్రకి తానే డబ్బింగ్ చెబుతాడట. ఆయనకు హిందీ బాగా వచ్చు కాబట్టి డబ్బింగ్ చెప్పడానికి పెద్ద ఇబ్బంది కూడ ఉండదు. ఇందులో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే!
Vijay Devarakonda
Puri Jagannadh
Ananya Panday
Karan Johar

More Telugu News