Perni Nani: అన్ని సినిమాల‌కూ ఒకేలా టికెట్ ధ‌ర‌ ఉండేలా కొత్త విధానం.. మంత్రి పేర్నినాని కీల‌క స‌మావేశం

nani meets with tollywood distributors

  • ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్ర‌యాల‌పై చర్చ‌
  • పాల్గొన్న సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు
  • సినిమాటోగ్రఫీ చట్టంలోని సవరణలపై కూడా చ‌ర్చ‌లు

సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి పేర్ని నాని స‌మావేశ‌మై ఆన్‌లైన్‌లో టికెట్ల విక్ర‌యాల‌పై చ‌ర్చ‌లు జరుపుతున్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల థియేటర్ల యజమానులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ఆన్‌లైన్‌ టికెట్ల అంశంతో పాటు సినిమాటోగ్రఫీ చట్టంలోని సవరణలపై వారితో మంత్రి చర్చలు జ‌రుపుతున్నారు.

అన్ని సినిమాలపై టికెట్‌ ధర ఒకే విధంగా ఉండేలా కొత్త విధానంపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అలాగే, ఏపీలోని థియేటర్ల సమస్యలపై కూడా చ‌ర్చిస్తున్నారు. ఆన్‌లైన్ లో టికెట్ల విక్ర‌యాల‌కు అందరూ అంగీకరించారని నిర్మాత‌ అంబికా కృష్ణ ఈ సంద‌ర్భంగా అన్నారు.

గ్రామాల్లో ఉండే థియేటర్లలో గ్రేడింగ్‌ సిస్టమ్‌ పెట్టాలని థియేటర్‌ యజమానులకు ప్ర‌భుత్వం సూచించింద‌ని చెప్పారు. కాగా, విద్యుత్ రాయితీలతో పాటు రేట్ ఆఫ్ అడ్మిషన్ సహా లైసెన్స్‌ల జారీ సరళతరం చేయాలని ఎగ్జిబిటర్లు కోరిన‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News