Sensex: వరుసగా మూడో రోజు కూడా నష్టపోయిన మార్కెట్లు
- అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న మార్కెట్లు
- 433 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
- 143 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టపోయాయి. మార్కెట్లు ఈరోజు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 433 పాయింట్లు నష్టపోయి 59,919కి పడిపోయింది. నిఫ్టీ 143 పాయింట్లు కోల్పోయి 17,873కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ కంపెనీ (1.67%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.57%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.22%), టీసీఎస్ (0.11%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.08%).
టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.83%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.42%), టెక్ మహీంద్రా (-2.26%), సన్ ఫార్మా (-2.00%), బజాజ్ ఫైనాన్స్ (-1.68%).