Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 767 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 229 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4 శాతం వరకు టెక్ మహీంద్రా షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత మార్కెట్లు ఒక్కసారిగా దూసుకుపోయాయి. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా తదితర హెవీ వెయిట్ కంపెనీల షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి.
దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 767 పాయింట్లు లాభపడి 60,686కి చేరుకుంది. నిఫ్టీ 229 పాయింట్లు పుంజుకుని 18,102కి ఎగబాకింది. ఈరోజు అన్ని సూచీలు లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (3.93%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.93%), ఇన్ఫోసిస్ (2.74%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.55%), ఏసియన్ పెయింట్స్ (1.89%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఆటో (-2.97%), టాటా స్టీల్ (-1.00%), యాక్సిస్ బ్యాంక్ (-0.47%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.11%), ఎన్టీపీసీ (-0.07%).