Ravi Shastri: "సరదాగా మందు కొడదాం రండి"... తనపై మీమ్స్ సృష్టికర్తలకు రవిశాస్త్రి ఆహ్వానం

Ravi Shastri comments on memes creators
  • టీమిండియా కోచ్ గా రవిశాస్త్రి పదవీవిరమణ
  • శాస్త్రిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్
  • వాటిలో కొన్నింటిని తాను ఆస్వాదిస్తానన్న రవిశాస్త్రి
  • మీమ్స్ రూపొందించడం ఓ కళ అంటూ శాస్త్రి వ్యాఖ్యలు
ఇటీవల టీమిండియా కోచ్ గా పదవీ విరమణ చేసిన క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి ఎంతో సరదాగా ఉండే వ్యక్తి. అందరితోనూ కలివిడిగా ఉండే ఆ నైజమే టీమిండియా కోచ్ గా ఇన్నేళ్ల పాటు కొనసాగేందుకు కారణమైంది. కాగా, రవిశాస్త్రిపై సోషల్ మీడియాలో ఆటగాళ్ల కంటే మిన్నగా మీమ్స్ వస్తుంటాయి. టీమిండియా ఓడిపోయిన సమయాల్లో శాస్త్రిని లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ జరుగుతుంటుంది. శాస్త్రిపై వచ్చే మీమ్స్ లో కొన్ని విపరీతమైన నవ్వు పుట్టిస్తుంటాయి.

తాజాగా ప్రముఖ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ, తనపై వచ్చే మీమ్స్ ను తాను కూడా ఎంజాయ్ చేస్తుంటానని వెల్లడించారు. తనపై కామెడీ చేస్తూ వచ్చే మీమ్స్ పట్ల అభ్యంతరం చెప్పబోనని, అలాంటి మీమ్స్ చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటానని తెలిపారు. "మనసు బాగోలేనప్పుడు మీమ్స్ ద్వారా వీళ్లు చక్కగా నవ్విస్తుంటారు. మీమ్స్ రూపొందించడం కూడా ఓ కళే. వాళ్లలో కొందరితో సరదాగా మందు కొట్టాలనుంది" అంటూ తన మనోభావాలను పంచుకున్నారు.
Ravi Shastri
Memes
Drink
Team India

More Telugu News