Army: మణిపూర్‌లో విరుచుకుపడిన ఉగ్రవాదులు.. ఆర్మీ కల్నల్ కుటుంబం సహా అమరులైన ఆరుగురు

Colonel Family and 3 Soldiers Dead In Ambush By Terrorists In Manipur

  • అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల మెరుపుదాడి
  • కల్నల్, ఆయన భార్య, కుమారుడు, ముగ్గురు జవాన్ల మృతి
  • నిర్ధారించిన ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్

మణిపూర్‌లో ఉగ్రవాదులు మెరుపుదాడికి తెగబడ్డారు. మయన్మార్ సరిహద్దులోని చురాచాంద్‌పూర్ జిల్లా సింఘత్‌లో ఈ ఉదయం 10 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో భారత ఆర్మీ కల్నల్, ఆయన భార్య, కుమారుడుతోపాటు మరో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని అధికారులు చెబుతున్నారు.

అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై గుర్తుతెలియని ఉగ్రవాద సంస్థ దాడికి పాల్పడింది. ఉగ్రదాడిలో ఆర్మీ కల్నల్, ఆయన భార్య, కుమారుడు మృతి చెందిన విషయాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ నిర్ధారించారు. ఉగ్రఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల కోసం రాష్ట్ర, పారామిలటరీ బలగాలు గాలిస్తున్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News