Bigg Boss: గంగవ్వకు నాగార్జున కట్టించి ఇచ్చిన ఇల్లు ఇదే.. గంగవ్వ చూపిస్తోంది రండి చూద్దాం!

Gangavva new house built by Nagarjuna house warming function over
  • బిగ్‌బాస్ సీజన్ 4లో 34 రోజులపాటు హౌస్‌లో గడిపిన గంగవ్వ
  • సొంతింటి కలను నెరవేర్చిన నాగార్జున
  • నాగార్జునకు, మాటీవీకి గంగవ్వ ధన్యవాదాలు
  • అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు
బిగ్‌బాస్ సీజన్ 4లో అందరినీ ఆకట్టుకున్న గంగవ్వకు హోస్ట్ నాగార్జున ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో 34 రోజులపాటు గడిపిన గంగవ్వ ఈ సందర్భంగా పలుమార్లు తన సొంతింటి కల గురించి హౌస్‌లోనూ, నాగార్జునతోనూ చెప్పుకొచ్చారు. ఆమె కథ విన్న నాగార్జున గంగవ్వకు తాను సొంతిల్లు కట్టించి ఇస్తానని మాటిచ్చారు. ఆయన సహకారంతో పూర్తయిన కొత్తింటిలోకి గంగవ్వ గృహ ప్రవేశం కూడా చేశారు. ఈ సందర్భంగా ఆ ఇంటి విశేషాలను తన యూట్యూబ్ చానల్‌లో చెప్పుకొచ్చారు.

తనకు కొత్త ఇల్లు కట్టించిన నాగార్జున, తాను బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టడానికి కారణమైన మాటీవీకి గంగవ్వ ధన్యవాదాలు తెలిపారు. గృహప్రవేశానికి కలగూరగంప టీం, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లు అఖిల్, సావిత్రి తదితరులు వచ్చినట్టు గంగవ్వ తెలిపారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన గంగవ్వ కొత్త ఇంటిని అందరికీ చూపించారు. మనమూ చూసేద్దామా..

Bigg Boss
Maa TV
Gangavva
House
Tollywood
Nagarjuna

More Telugu News