Saitej: మారుతి డైరెక్షన్లో మరోసారి సాయితేజ్!

Saitej in Maruthi movie
  • దూకుడు పెంచిన మారుతి 
  • ఇటీవల సాయితేజ్ ను కలిశాను 
  • ఆయనకి ఒక కథ చెప్పాను
  • త్వరలో ప్రాజెక్టు ఉండొచ్చన్న మారుతి 
మారుతి వరుస సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. 'మంచి రోజులు వచ్చాయి' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన, ఆ తరువాత సినిమాగా 'పక్కా కమర్షియల్'ను సెట్ చేసుకుంటున్నాడు. గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా ఈ సినిమా రూపొందింది. సాధ్యమైనంత త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇక చిరంజీవితో ఒక సినిమా చేయనున్నానని చెప్పిన ఆయన, చిరంజీవి ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యేలోగా కొన్ని ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. అందులో భాగంగా సాయితేజ్ తో ఒక సినిమా చేయనున్నట్టుగా చెప్పాడు. హాస్పిటల్ నుంచి వచ్చిన తరువాత తాను సాయితేజ్ ను కలిసినట్టుగా చెప్పాడు.

'సుప్రీమ్' సినిమా సమయంలో ఉన్నట్టుగా సాయితేజ్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడని చెప్పాడు. ఆయనతో ఒక సినిమా చేయనున్నానని అన్నాడు. ఒక కథను సాయితేజ్ కి చెప్పడం జరిగిందని అన్నాడు. త్వరలోనే ఆ సినిమా ఉండొచ్చని చెప్పాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ప్రతిరోజూ పండగే' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
Saitej
Maruthi
Prathi Roju Pandage Movie

More Telugu News