Maoist Party: గ్యారపట్టి ఎన్ కౌంటర్ పచ్చిబూటకం: మావోయిస్టు పార్టీ

Maoist Central Committee dismisses its a fake encounter

  • నిన్న మహారాష్ట్రలో భీకర ఎన్ కౌంటర్
  • 26 మంది మావోయిస్టులు మృతి
  • పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలన్న మావోయిస్టు పార్టీ
  • పోలీసులు ఇన్ఫార్మర్ వ్యవస్థను పెంచిపోషిస్తున్నారని వెల్లడి

మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీప్రాంతంలో నిన్న జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు మరణించడం తెలిసిందే. దీనిపై మావోయిస్టు పార్టీ తీవ్రస్థాయిలో స్పందించింది. గ్యారపట్టి ఎన్ కౌంటర్ పచ్చిబూటకం అని ఆరోపించింది. ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. పోలీసులు ఇన్ఫార్మర్ల వ్యవస్థను పెంచిపోషిస్తున్నారని పేర్కొంది. గ్యారపట్టి ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.

నిన్న ఉదయం గ్యారపట్టి వద్ద పోలీసులకు, నక్సల్స్ కు మధ్య భారీస్థాయిలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్ గఢ్ అటవీప్రాంతం నుంచి గడ్చిరోలి జిల్లాలోకి నక్సల్స్ ప్రవేశిస్తున్నారని పోలీసులకు స్పష్టమైన సమాచారం అందింది. దాంతో పక్కా ప్రణాళికతో కూంబింగ్ కు వెళ్లిన మహారాష్ట్ర సీ-60 కమాండో ఫోర్స్ మావోయిస్టులకు తీవ్ర నష్టం కలిగించింది.

ఈ దాడుల్లో మావోయిస్టు అగ్రనేత మిలింద్ బాబూరావ్ తేల్ తుంబ్డే అలియాస్ దీపక్ తేల్ తుంబ్డే కూడా హతుడైనట్టు తెలుస్తోంది. మూడేళ్ల కిందట జరిగిన భీమా-కోరేగావ్ అల్లర్ల వెనుక తేల్ తుంబ్డే ఉన్నట్టు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News