Savitri Wife of Satyamurthy: '20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్య' కథాంశంతో 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'.. విడుదలకు సిద్ధం

Savitri wife of satyamurthy release date

  • ప్రధాన పాత్రలను పోషించిన శ్రీలక్ష్మి, పార్వతీశం
  • ఈ నెల 19న థియేటర్లలో విడుదల
  • కొత్త దర్శకుడు చైతన్య తెరకెక్కించిన చిత్రం

20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్యనా.. ఎలా?. వినడానికే చాలా విచిత్రంగా, ఆసక్తికరంగా ఉంది కదూ? ఇదే కథాంశంతో 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి' సినిమా వస్తోంది. ఈ చిత్రంలో 60 ఏళ్ల సావిత్రి పాత్రను సీనియర్ నటి శ్రీలక్ష్మి పోషించగా, 20 ఏళ్ల కుర్రాడి పాత్రలో పార్వతీశం నటించాడు.

40 ఏళ్ల తేడా ఉన్న వీరిద్దరూ భార్యాభర్తలు ఎలా అయ్యారనే విషయం తెలియాలంటే ఈ నెల 19 వరకు ఆగాల్సిందే. 19న ఈ చిత్రం థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు చైతన్య తెరకెక్కించారు. మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర ఈ సినిమాను నిర్మించారు.

  • Loading...

More Telugu News