Venkatrami Reddy: సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. ఆమోదించిన ప్రభుత్వం!

Siddipet District collector Venkatrami Reddy resigns for IAS
  • స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వెంకట్రామిరెడ్డి
  • సీఎస్ సోమేశ్ కుమార్ కు రాజీనామా లేఖ అందజేత
  • టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు సమాచారం
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు రాజీనామా లేఖను అందించారు. వెంటనే ఆయన రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు టీఆర్ఎస్ పార్టీలో వెంకట్రామిరెడ్డి చేరబోతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత విధేయుడిగా ఆయనకు పేరుంది. గతంలో సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేసీఆర్ కు ఆయన పాదాభివందనం చేశారు. ఈ చర్యపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఐఏఎస్ అధికారి అయి ఉండి ఇలాంటి పని ఎలా చేస్తారని పలువురు విమర్శించారు.
Venkatrami Reddy
IAS
Resign
TRS
KCR
Siddipet District

More Telugu News