Bhumika: నన్నెవరూ కమిట్ మెంట్ అడగలేదు: భూమిక

No one asked me for commitment says Bhumika
  • కమిట్ మెంట్ ఇస్తేనే ఆఫర్లు వస్తాయనే వార్తల్లో నిజం లేదు
  • నిర్మాతలతో టచ్ లో ఉండాలనే వార్తలు అవాస్తవం
  • ఒక పాత్రకు నేను సరిపోతాననుకుంటే ముంబైకి వచ్చి మాట్లాడేవారు
ఉత్తరాది భామ భూమిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ తో ఆమె నటించిన చిత్రం 'ఖుషీ' సూపర్ హిట్ కావడంతో ఆమె స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. ఎన్నో చిత్రాలలో తెలుగు ప్రేక్షకులను ఆమె మెప్పించింది.

ఆ తర్వాత యోగా టీచర్ భరత్ ఠాకూర్ ను పెళ్లి చేసుకుని కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కమిట్ మెంట్ ఇస్తేనే ఆఫర్లు వస్తాయని, నిర్మాతలతో ఎప్పుడూ టచ్ లో ఉండాలనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని భూమిక తెలిపింది. ఎన్నో ఏళ్ల నుంచి తాను ఇండస్ట్రీలో ఉన్నానని... తనను ఎవరూ, ఎప్పుడూ కమిట్ మెంట్ అడగలేదని చెప్పింది. ఒక పాత్రకు తాను సరిపోతానని దర్శకనిర్మాతలు అనుకుంటే... ముంబైకి వచ్చి తనను కలిసి మాట్లాడేవారని తెలిపింది. ఇండస్ట్రీలో తాము కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నామని ఎంతో మంది నటీమణులు చెపితే... దానికి విరుద్ధంగా భూమిక చెప్పడం ఆసక్తికరంగా మారింది.
Bhumika
Tollywood
Casting Couch

More Telugu News